మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:44 IST)

హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి మీరంటే మీరే : హూడా వర్సెస్ సెల్జా!

హర్యానా రాష్ట్రంలో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ నేతలు మీరంటే.. మీరేనంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుమారి షెల్జా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై అంతెత్తున మండిపడ్డారు. హర్యానాలో పార్టీని మూడో స్థానానికి దిగజార్చిన హుడాపై ఆమె ఆవేదన నిజమేనన్నట్లు... మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా షెల్జా వ్యాఖ్యలపై నోరువిప్పలేదు. 
 
భారత్‌లో హర్యానా నెంబర్.1 అన్నారు. మరి రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి ఎందుకు దిగజారింది. అంటే ఊరికెనే ఊకదంపుడు నినాదాలు చేశారన్న మాటేగా. అసలు మీ నినాదం ప్రజల దరికే చేరలేదు. రాష్ట్రంలో పార్టీ దుస్థితికి మీరే కారణం అంటూ హుడాపై షెల్జా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పార్టీ ఘోర పరాజయానికి హుడా ఒక్కరే కారణమా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహం పాత్ర ఏమీ లేదా? అంటూ రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి.