గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జులై 2016 (21:57 IST)

నా ఏపీ ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు పెడ్తారు... ఆసుపత్రికి వెళ్లాలి... కేవీపి రామచంద్రరావు

ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు

ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు ఓటింగుకు పెడ్తారు..? నా గొంతు పోయింది. ఆసుపత్రికి పోవాలి. 
 
నేను ఏడాది క్రితమే బిల్లు పెట్టాను. చర్చ చేశారు. ఇప్పుడు కుట్రతో ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా మారుస్తున్నారు. అలా అయితే అన్ని బిల్లులు ద్రవ్య బిల్లులుగా మారుతాయి. ఇది ఓ డేంజర్ స్థితి. గత ప్రధాని ఇచ్చిన హామీని అమలపరచకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ. ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఏడాది పాటు సమయాన్నంతా వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటారా...? ఏపికి ప్రత్యేక హోదా కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుందని కేవీపి అన్నారు.