శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (08:53 IST)

చంద్రబాబు - కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని అనుకోలేదు : సీతారాం ఏచూరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. 
 
ఇదేఅంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, కేసీఆర్‌లు ఆధిపత్య ధోరణిని విడనాడి ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై వారు దృష్టి కేంద్రీకరించాలని ఏచూరి సూచించారు. 
 
ఇకపోతే లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగే అవకాశమే లేదని ఏచూరి హెచ్చరించారు. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఎక్కువైందని ఏచూరీ ఆరోపించారు.