Widgets Magazine

అపుడు గడ్డి తిన్నాను సరే... ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారు : లాలూ ప్రశ్న

ఆదివారం, 5 నవంబరు 2017 (08:45 IST)

lalu prasad yadav

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను గడ్డితిన్నమాట నిజమేనని ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రూ.13.50 కోట్ల నిధులను దోచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ వార్తలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ, తాను అప్పట్లో గడ్డి తిన్నానని అన్నవాళ్లు ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బీహార్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన టాయిలెట్ల కుంభకోణాన్ని తన హయాంలో జరిగిన దాణా కుంభకోణంతో పోల్చారు. అప్పట్లో తనను గడ్డి తిన్నారని అందరూ ఆడిపోసుకున్నారని, మరి ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని ప్రశ్నించారు. నితీశ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుంభకోణాల్లో ఇరుక్కుంటుందని జోస్యం చెప్పారు. 
 
కాగా, గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన నితీశ్ ఇటీవల ఆర్జేడీకి టాటా చెప్పి బీజేపీని చెంతకు చేర్చుకుని, కమలనాథుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీశ్, లాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఫలితంగానే నితీశ్‌పై లాలూ ఘాటైన విమర్శలు చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజా ఓ తింగరబుచ్చి... డ్యాన్సులు వేయడం మినహా ఏమీ తెలియదు!

వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల ...

news

నటుడు ఉపేంద్రకు షాకిచ్చిన గాలి జనార్థన రెడ్డి...

దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు ...

news

తిరుమలలో జగన్ కంటే రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారా?

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ ...

news

ఎపి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే.. చంద్రబాబు(వీడియో)

తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ...

Widgets Magazine