Widgets Magazine

కర్ణాటకలో బీజేపీ అయితే బీహార్‌లో మాదే పెద్దపార్టీ : తేజశ్వి

గురువారం, 17 మే 2018 (09:02 IST)

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని భావిస్తే, బీహార్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ మాదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వియాదవ్ గుర్తుచేశారు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు తమకే తొలుత అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Tejashwi Yadav
 
మంగళవారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో అక్కడి గవర్నర్... ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు. దీనిపై బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. 
 
కర్ణాటకలో అతిపెద్ద పార్టీ అయినందున బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చినందున, బీహార్‌లోనూ మాకూ అవకాశమివ్వాలన్నారు. బీహార్‌లో మాదే అతిపెద్ద పార్టీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద పార్టీనే అవసరమైతే, బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీనే అన్నారు. 
 
సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కర్ణాటకలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. అందుకే రాష్ట్రపతి... బీహార్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ఆర్జేడీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, మహా కూటమి 2019 ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజ్యాంగ ధర్మాస తీర్పును తుంగలో తొక్కిన కర్ణాటక గవర్నర్

హంగ్ అసెంబ్లీ ఎర్పడిన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ రసకందాయంలో పడింది. కాంగ్రెస్ - జేడీఎస్ ...

news

రేపే యడ్డి సీఎంగా ప్రమాణం... కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో...

కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అక్కడి రాజకీయ పార్టీలు తలలు బాదుకుంటున్నాయి. రేపు భాజపా ...

news

టిటిడి మొదటి బోర్డు మీటింగే వివాదాస్పదం.. ఎందుకు?(Video)

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల ...

news

లాంచీ బాధిత కుటుంబాలను ఆదుకోండి... ప్రభుత్వ ఉద్యోగమివ్వండి...

అమరావతి : గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ...