గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (10:19 IST)

లెఫ్ట్ పార్టీల పతనం.. రేపటికి విపత్తుకు కారణం : జైరాం రమేష్

దేశంలో లెఫ్ట్(వామపక్ష)పార్టీల అంతం రేపటికి విపత్తుకు కారణభూతమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలైన నేపథ్యంలో దేశానికి బల

దేశంలో లెఫ్ట్(వామపక్ష)పార్టీల అంతం రేపటికి విపత్తుకు కారణభూతమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలైన నేపథ్యంలో దేశానికి బలమైన వామపక్షం ఉండాల్సిన అవసరముందన్నారు. 
 
త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన 48 గంటల్లోపే వారి రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోయారు. భారీగా హింసాకాండకు దిగి కారల్ మార్క్స్, లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. సీపీఎం కార్యాలయాలపై, ఆ పార్టీ కార్యకర్తల గృహాలపై దాడులు, దహనాలకు పాల్పడ్డారు. ఈ హింసలో ఇద్దరు మృతి చెందారు. బెలోనియా జిల్లా కేంద్రంలోని పబ్లిక్ స్కేర్‌లో ఉన్న ఐదడుగుల లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేశారు. 
 
ఈ పరిణామాలపై జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ వామపక్షాలు అంతమవుతున్న తీరు రేపటి విపత్తుకు కారణభూతమవుతుందన్నారు. మేం వామపక్ష పార్టీలతో పోరాడుతాం. మా పోరాటాలు రాజకీయాలకే పరిమితం. అయితే వామపక్ష పార్టీలు అంతమై పోవడాన్ని మన దేశం అంత త్వరగా భరించదు అని ఆయన వ్యాఖ్యానించారు.