గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (11:24 IST)

భారత ఆర్మీ జవాన్లు చనిపోయారా? ముందు ఇఫ్తార్ విందు ఆరగించి ఎంజాయ్ చేద్దాం : పాక్ హైకమిషనర్

ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. పలు దేశాల్లోని ఉగ్రవాదులపై కొన్ని అగ్రదేశాలు ముమ్మరంగా దాడులు కూడా చేస్తున్నాయి. ఈ విషయంలో ఒక్క పాకిస్థాన్‌కు మాత్రం చీమకుట్టినట్టు అయినా లేదు. ఈ విషయం తాజా

ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. పలు దేశాల్లోని ఉగ్రవాదులపై కొన్ని అగ్రదేశాలు ముమ్మరంగా దాడులు కూడా చేస్తున్నాయి. ఈ విషయంలో ఒక్క పాకిస్థాన్‌కు మాత్రం చీమకుట్టినట్టు అయినా లేదు. ఈ విషయం తాజాగా కూడా నిరూపితమైంది. 
 
శనివారం జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద దాడిలో 8 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ విషయం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు కూడా సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఇఫ్తార్ విందులో ఉన్నారు. అపుడు అక్కడ వున్న ఓ విలేకరి ఈ దాడిపై స్పందించాలని కోరారు. దీనికి ఆయన ఏవిధంగా సమాధానం ఇచ్చారో చూడండి. 
 
'ఇది రంజాన్ నెల. ఇఫ్తార్ పార్టీ మీద దృష్టిపెడదాం. జమ్మూ-కాశ్మీరు సమస్యపై భారతదేశం, పాకిస్థాన్ మధ్య వివాదం జరుగుతోంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చర్చించి, పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నాం. భారత్, పాకిస్థాన్ సంబంధాల గురించి ఇదివరకే చెప్పాను. ఈరోజు మనం ఇఫ్తార్ ఆనందంగా జరుపుకుందాం.ఇఫ్తార్ పార్టీ చేసుకుని మనం సంతోషిద్దాం' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. 
 
ఈ ఇఫ్తార్ విందును న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమషన్‌లో శనివారం నిర్వహించారు. ఈ విందులో అబ్దుల్ బాసిత్ కూడా పాల్గొన్నారు. యావత్ ప్రపంచం శాంతియుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు బాసిత్ చెప్పారు. భారతదేశం విషయంలో పాకిస్థాన్ విదేశాంగ విధానం కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తుందన్నారు.