శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (12:17 IST)

దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులకు జీవిత ఖైదు

ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు

ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు.

రైల్వే స్టేషనుకు ఆటోలో వెళుతున్న ఓ దళిత బాలికను ఆటో రిక్షా డ్రైవరు షమీమ్ అలియాస్ ఛోటు, తన ఇద్దరు స్నేహితులైన బీరేంద్ర యాదవ్, రామ్ కుమార్ షాలు బాలికను విశ్వవిద్యాలయ పోలీసుస్టేషను పరిధిలోని బస్టాండు వద్ద ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ అత్యాచారం జరిపారు. 
 
దర్బంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జీ విచారించి వారిని దోషులని ప్రకటించి వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరూ రూ15వేల చొప్పున జరిమానా విధించారు.