శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 మే 2016 (09:11 IST)

రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులు... వివాదాస్పద ఆయుధ వ్యాపారి కానుక

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కష్టాల్లో చిక్కుకునేనా ఉన్నారు. లండన్‌కు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి నుంచి రూ.19 కోట్ల విలువైన భవనం కానుకగా పొందినట్టు తాజాగా వార్తలు వచ్చాయి. 
 
భారతకు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారి నుంచి లండన్‌లోని బ్రియాన్‌స్టన్‌ స్క్వేర్‌లోని 12 ఎల్లర్టన్‌ హౌస్‌ను బినామీ పేరుతో వాద్రా సొంతం చేసుకున్నారనడానికి పక్కా ఆధారాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు లభించాయి. 2009 అక్టోబరులో రూ.19 కోట్లకు ఈ భవనాన్ని కొనుగోలు చేసి 2010 జూన్‌లో విక్రయించినట్లు ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంజయ్‌ భండారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో వాద్రా 'బినామీ' బంగ్లా బాగోతం వెలుగు చూసింది. ఈ బంగ్లా కొనుగోలు, మరమ్మతులు, విక్రయానికి సంబంధించిన ఈమెయిళ్లు ఐటీ అధికారులకు లభించాయి. వాద్రాకు, లండన్‌లో నివసిస్తున్న భండారి బంధువు సుమీత చద్దాకు నడుమ.. వాద్రా సహాయకుడు మనోజ్‌ అరోరా, చద్దాకు నడుమ జరిగిన ఈమెయిళ్లను ఐటీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.