శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (11:06 IST)

ఆ దుర్మార్గుడితో రాజీ ప్రసక్తే లేదు: సోమ్‌నాథ్ భారతి భార్య లిపికా మిత్రా

తన భర్త ఓ దుర్మార్గుడని, అతనితో రాజీకి వచ్చే ప్రసక్తే లేదని ఢిల్లీ న్యాయశాఖామంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి సతీమణి లిపికా మిత్రా తేల్చి చెప్పింది. దీంతో సోమ్‌నాథ్ భారతి చిక్కుల్లో పడ్డారు. 
 
ప్రస్తుతం సోమ్‌నాథ్ గృహహింస, హత్యాయత్నం కేసులు కొనసాగనున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు హాజరైన లిపికా మిత్రా తన భర్తతో రాజీకి కానీ, మధ్యవర్తిత్వంలో పాల్గొనేందుకు కానీ సముఖంగా లేనని స్పష్టం చేశారు. 
 
దీంతో సోమనాథ్ భారతి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ద్వారా బెయిల్‌కు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సోమనాథ్ భారతికి సూచించింది. కాగా, ఈ కేసులో సోమ్‌నాథ్ భారతి నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు లొంగిపోయిన విషయం తెల్సిందే.