గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (18:59 IST)

జయలలిత ఆరోగ్యంపై మీడియా ఓవరాక్షన్: అపోలో ప్రకటనలే కారణమా..? అంతా అయోమయం.. గందరగోళం..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై మీడియా ఓవరాక్షన్ చేస్తుందని అన్నాడీఎంకే కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తున్నారు. రెండు నెలల కంటే పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ ఫోటోలను విడుదల చేయకపోవడంపై అపోలోయంత్ర

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై మీడియా ఓవరాక్షన్ చేస్తుందని అన్నాడీఎంకే కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తున్నారు. రెండు నెలల కంటే పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ ఫోటోలను విడుదల చేయకపోవడంపై అపోలోయంత్రాంగంపైన కూడా జయ అభిమానులు మండిపడుతున్నారు. ఆమె ఎలా ఉన్నారో.. ఏంటో తెలియట్లేదని.. మరోవైపు మీడియా నానా రకాల వార్తలు ప్రచురితం చేస్తుందని వారు ఫైర్ అవుతున్నారు. 
 
కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ టీవీ ఛానల్స్‌ ఆమె మృతిచెందారని వార్తలు ప్రసారం చేసి తిరిగి ఉపసంహరించుకోవడం అభిమానులను తీవ్ర భావోద్వేగాలకు గురిచేసింది. అయితే ఈ వదంతులను అపోలో ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. జయలలితకు చికిత్స కొనసాగుతోందని ప్రకటించాయి. 
 
అయితే ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతా అయోమయం.. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపైనే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ మీడియా వదంతుల కారణంగా తీవ్ర గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది.
 
ఓ పక్క స్థానిక టీవీ ఛానెళ్లలో అమ్మ కన్నుమూశారన్న వార్తలు ప్రసారం అవడం, చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవనతం చేయడంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారిక ప్రకటన ఏమీ లేకుండానే చోటు చేసుకుంటున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. మరోవైపు అపోలో ఆస్పత్రి వర్గాలు అమ్మకు చికిత్స కొనసాగుతోందని ప్రకటించాయి.
 
కానీ అంతకుముందు.. సీఎం జయలలిత హెల్త్ విషమంగానే ఉందని లండన్‌ డాక్టర్ రిచర్డ్‌ బేలే తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రపంచంలో అధునాతన ట్రీట్‌మెంట్‌ను జయకు అందించినప్పటికీ, గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని రిచర్డ్‌ వ్యాఖ్యానించారు.
 
ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్‌, అపోలో వైద్యులు వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం.