మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (09:47 IST)

జయలలితకు యాంజియోగ్రామ్.. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలి: వైద్యులు

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్‌ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యు

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్‌ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. 
 
సోమవారం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టుపక్కలా దుకాణాలు, హోటళ్లు దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.