శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (13:11 IST)

కాంగ్రెస్‌కు లోక్‌సభ ప్రతిపక్ష ఇచ్చే ప్రసక్తే లేదు: స్పీకర్ సుమిత్రా

లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్‌‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సున్నితంగా తిరస్కరించారు. సభ నియమాలను అధ్యయనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ అందింది. 
 
లోక్‌సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పీకర్ మహాజన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ అంశంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ అభిప్రాయాన్ని స్పీకర్ తెలుసుకున్నారు. లోక్‌సభలో 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ తర్వాత 44 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత హోదా కోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. 
 
అయితే అవసరమైన 10 శాతం సీట్లకు 11 స్థానాల దూరంలో కాంగ్రెస్ ఉన్నందున కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ప్రస్తుత నియమాలను మార్చాల్సి ఉంటుందని, ఇది సభలో జరగాల్సిన వ్యవహారమని ఆమె అన్నారు.