Widgets Magazine Widgets Magazine

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:10 IST)

Widgets Magazine
suicide

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్ళికి నిరాకరించారు. 
 
ఇటీవల ప్రేయసిని కలిసేందుకు రఘు గుడిపల్లి గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో తమ ద్విచక్ర వాహనం కనిపించడంలేదని అమ్మాయి తరుపు బంధువులు గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో రఘును పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
చికిత్స నిమిత్తం రఘును నల్లగొండ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రఘు మరణించాడు. ఈ విషయమై మృతుడి సోదరుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

పర్మనెంట్ గవర్నర్ లేదు.. గవర్నమెంటూ లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: విజయ్‌కాంత్

డెల్టా జిల్లాల్లో రైతులు పంట నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. స్థిరమైన ప్రభుత్వం ...

news

సోమవారమే డెడ్‌లైన్.. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే..? ఆ కేసులో జయ పేరు తొలగింపుకు ఓకే

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి ...

news

చిన్నమ్మ నుంచి పన్నీర్ క్యాంపుకు పాండ్యరాజన్ జంప్.. అరుణ్ జైట్లీ హస్తముందా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ ...

news

అమ్మతో మాట్లాడినా సహించని భూతం శశికళ: మండిపడ్డ సెల్వం

ఒక వైపు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు తన పక్షం చేరకపోవడం, మరోవైపు తనను అమ్మకు ద్రోహం ...