శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:05 IST)

తాజ్‌మహల్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట.. వేర్వేరు మతాలు కావడంతో?

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో చారిత్రాత్మక తాజ్ మహల్ నిర్మించారు. ప్రపంచంలోని 7 వింతలలో తాజ్ మహల్ నిలిచిపోయింది. ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే తాజ్ మహల్ ఎదుట దారుణం చోట

మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో చారిత్రాత్మక తాజ్ మహల్ నిర్మించారు. ప్రపంచంలోని 7 వింతలలో తాజ్ మహల్ నిలిచిపోయింది. ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే తాజ్ మహల్ ఎదుట దారుణం చోటుచేసుకుంది. తాజ్‌మహల్ ఎదుట ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో వారి పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తాజ్‌మహల్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.  అనుకున్నంత పని చేసింది. ప్రేమ జంట ఎక్కడ నుంచి వచ్చారు, ఘటనకు గల ఇతర కారణాలేంటో తెలియలేదు.
 
కాగా.. షాజహాన్, ముంతాజ్ ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన అందమైన పాలరాతి కట్టడం తాజ్‌మహల్. మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మారింది. తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపుర నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది.