గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (16:04 IST)

తమిళనాడు అసెంబ్లీలో ఎంకే.స్టాలిన్‌పై దాడి.. గుండీలు విప్పేసిన చొక్కాతో...

తమిళనాడు అసెంబ్లీ వేదికగా విపక్ష నేత ఎంకే స్టాలిన్‌పై దాడి జరిగినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ బందోబస్తు కోసం నియమించిన అసిస్టెంట్ కమిషనర్ శేషసాయి తనపై దాడి చేసినట్టు స్టాలిన్ అసెంబ్లీ

తమిళనాడు అసెంబ్లీ వేదికగా విపక్ష నేత ఎంకే స్టాలిన్‌పై దాడి జరిగినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ బందోబస్తు కోసం నియమించిన అసిస్టెంట్ కమిషనర్ శేషసాయి తనపై దాడి చేసినట్టు స్టాలిన్ అసెంబ్లీ వెలువల మీడియాకు చెప్పారు. అంతేకాకుండా, చిరిగిన చొక్కాతో అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా తమిళనాడు అసెంబ్లీ సమావేశమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ.. అనేక నాటకీయ పరిణామాల మధ్య సభ తొలుత ఒంటి గంటకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. 
 
అయితే సభలో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాలని స్టాలిన్‌తో పాటు.. పన్నీర్ సెల్వం వర్గం, కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనికి స్పీకర్ అంగీకరించక పోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ మార్షల్స్‌ను సభలోకి ఆహ్వానించి డీఎంకే సభ్యులందరినీ బయటకు పంపించాల్సిందిగా ఆదేశించారు. అపుడే మార్షల్స్, డీఎంకే సభ్యుల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. 
 
దీనిపై స్టాలిన్ స్పందిస్తూ... 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తమకు చెప్పారని, అయితే 2 గంటల సమయంలో పోలీసులు తమ వద్దకు వచ్చి బలవంతంగా తమను గెంటేశారని, తన చొక్కా చిరిగిపోయిందని ఆయన వాపోయారు. గుండీలు ఊడి, చిరిగిన చొక్కాను మీడియాకు చూపించారు. అసెంబ్లీ స్పీకర్ తన చొక్కాను తానే చించుకుని డీఎంకే ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారని స్టాలిన్ వివరించారు. ఇప్పటికీ తాము సీక్రెట్ బ్యాలెట్‌నే కోరుతున్నామని ఆయన స్పష్టంచేశారు. 
 
అసెంబ్లీలో తనను కొట్టారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలతో పాటు తననను శాసనసభ నుంచి గెంటేశారని చెప్పారు. తనను బలవంతంగా గెంటేశారన్నారు. ఆయన గుండీలు విప్పేసిన చొక్కాతో కనిపించారు. తన సహచర ఎమ్మెల్యేలతో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
సభలో జరిగిన విషయాలను వివరించారు. న్యాయానికి అన్యాయం జరిగిందని, రహస్య బ్యాలెట్‌ను నిర్వహించాలని తాము డిమాండ్ చేశామన్నారు. కానీ స్పీకర్ అందుకు నిరాకరించారన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను స్పీకర్ అంగీకరించకపోవడం అన్యాయమని తెలిపారు.