Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండు కాళ్లు విరిగిపోయాయి.. మంచానికే పరిమితమైన భర్త... భార్య చంపేయాలనుకుంది..

మంగళవారం, 10 జనవరి 2017 (09:47 IST)

Widgets Magazine

అత్యాచారాలు, అక్రమ సంబంధాల నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు ఓ వైపు జరుగుతుంటే.. అదే మహిళలు ప్రేమ కోసం ప్రియుడు కోసం భర్తలను దూరం చేసుకుంటున్నారు. తాజాగా వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను హ‌త్య చేసి అడ్డు తొల‌గించుకోవాల‌నుకున్న ఓ భార్య.. అతడి ప్రేమికుడితో పాటు దొరికిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలోని వలసపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య‌, ముగ్గురు పిల్లలున్నారు. ఏడాది క్రితం ప‌నిలో ఉండ‌గా బండ‌లు మీద‌ప‌డ‌డంతో అత‌డి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో అప్ప‌టి నుంచి మంచానికే ప‌రిమిత‌మ‌య్యాడు. అప్ప‌టికే నిమ్మ‌న‌ప‌ల్లె మండ‌లంలోని దేవ‌ళం క‌రప‌ల్లెకు చెందిన వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న బాధితుడి భార్య.. భ‌ర్త‌ను పట్టించుకోవ‌డం పూర్తిగా మానేసింది. 
 
ఇంకా అతడిని వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆదివారం అతడు నిద్రపోతున్న సమయంలో ప్రియుడితో కలిసి భర్త ముఖంపై తలగడ ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించింది. కానీ అప్రమత్తమైన భర్త కేక‌లు వేయ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చి పారిపోతున్న భార్య‌, ఆమె ప్రియుడిని ప‌ట్టుకుని చెట్టుకు క‌ట్టేసి చిత‌క‌బాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని విడిపించి.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Madanapalle Chittoor Sunday Crime News

Loading comments ...

తెలుగు వార్తలు

news

సంక్రాంతికి 'కత్తి' కట్టని కోడి పందేలు... సుప్రీం తీర్పుతో నిర్వాహకుల్లో హుషారు

ఈ సంక్రాంతి పండుగకు కోడిపందేలు నిర్వహణ గతంకంటే కాస్త విభిన్నంగా సాగనుంది. కోడిపందేల్లో ...

news

ఒక్క రోజులో ఇన్ని నియామకాలా.. చెల్లవు గాక చెల్లవన్న సుప్రీం కోర్టు

తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో అసాధారణ నియామకాలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ...

news

'మీ నాన్న జగమొండి'.... మనుమరాలితో ములాయం :: అవును నేను మొడివాడినే...అఖిలేష్

తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ తనకు చుక్కలు చూపించడాన్ని ఎస్పీ అధినేత ములాయం ...

news

భారత్‌కు స్కార్పీన్‌ జలాంతర్గామి సిద్ధం :: జలాంతర్గామి అణు సామర్థ్య క్షిపణిని పరీక్షించిన పాక్‌

ఫ్రాన్స్‌ సహకారంతో నిర్మిస్తున్న ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాముల్లో రెండోదైన ఖందేరీ ఈ నెల ...

Widgets Magazine