12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష

సోమవారం, 27 నవంబరు 2017 (10:33 IST)

child mother

మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలకు మధ్యప్రదేశ్ సర్కారు సీరియస్‌గా తీసుకోనుంది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు, వేధింపుల కేసులు మ‌రింత పెరిగిపోయాయి. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. దీంతో అత్యాచార నేరాల‌కు ఆ రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించనున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా.. మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
12 ఏళ్ల లోపు బాలిక‌ల‌పై అత్యాచారం చేసే కామాంధులకు ఉరిశిక్ష విధించాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణ‌యించి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో చట్టం తీసుకురానున్నట్లు తెలిపింది. మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తామని ఆర్థిక మంత్రి జయంత్‌ తెలిపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కమల్ హాసన్ అభిమానిపై చేజేసుకున్నాడా? (వీడియో)

సినీ లెజెండ్ కమల్ హాసన‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ...

news

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ...

news

కేఈకి జగన్మోహన్ రెడ్డి చెక్.. పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ...

news

బెదిరింపులు ఆమోదనీయం కాదు.. పద్మావతిపై ఉప రాష్ట్రపతి

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన ...