Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైన పోలీస్...

సోమవారం, 26 జూన్ 2017 (11:12 IST)

Widgets Magazine
thief

ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసులే.. దొంగలుగా మారితే ఇక రక్షణ సంగతి దేవుడే చూసుకోవాలి. తాజాగా ఓ పోలీసు.. పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ సీసీటీవీ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వింత దొంగతనం ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చీపుర్‌ మార్కెట్‌లో రాత్రివేళ గస్తీ తిరుగుతున్న ఒక పోలీసు పాల ప్యాకెట్లు చోరీచేస్తూ సీసీటీవీకి చిక్కాడు. 40 సెకెన్లున్న ఆ వీడియోలో ఆ పోలీసు నిర్వాకం రికార్డయింది. ఖాకీ గస్తీలో ఉంటూ ఒక దుకాణం వద్దనున్న పాల ప్యాకెట్ల వద్దకు వెళ్లాడు. ఇటు అటు చూసి... పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వచ్చేశాడు. 
 
ఖిల్చీపుర్ మార్కెట్‌లోని సౌరభ్ పాల డెయిరీకి చెందిన ఒక దుకాణంలో ప్రతీ రోజూ పాల ప్యాకెట్లు లెక్కించినప్పుడు తక్కువ ఉంటున్నాయి. దీంతో దొంగతనం జరుగుతున్నదని అనుమానం వచ్చిన ఆ దుకాణం యజమాని... తన షాపు ముందు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. అతను సీసీటీవీని పరిశీలించగా ఒక పోలీసు పాల ప్యాకెట్ల చోరీకి పాల్పడుతున్నాడని తేలింది. దీంతో ఈ సమాచారాన్ని అతను పోలీసు అధికారులకు తెలియజేశాడు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాకీ తీర్చమంటే.. స్క్రూ డ్రైవర్‌తో గుండెల్లో పొడిచాడు.. ఎక్కడ?

ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన ...

news

పెళ్లి వద్దన్నాడు.. శృంగారానికి నిరాకరించాడు.. కూరగాయలు కోసే కత్తితో వాటిని కోసేసింది...

ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో ...

news

దేశవ్యాప్తంగా రంజాన్ సందడి... ప్రజలకు నేతల ఈద్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు ...

news

ఎంత మ్యాక్‌బెత్ స్టోరీ ఇష్టమైతే మాత్రం హోం వర్క్‌గా సూసైట్ లేఖ రాయమంటారా?

పాఠం చెప్పే టీచర్ తానేం చెబుతున్నదీ మర్చిపోతే విచక్షణ లేకుండా ఆ లండన్ టీచర్ చేసిన ...

Widgets Magazine