బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 జూన్ 2015 (19:03 IST)

రావణుడిపై ''రాము''కి ఎంత భక్తంటే..?

ఇదేంటి రావణుడిపై రాముకి భక్తి అనుకుంటున్నారా? అయితే ఆశ్చర్చపోకుండా చదవండి. లంకకు అధిపతి రావణుడిని శ్రీరాముడు హతమార్చిన సంగతి అందరికి తెలిసిందే. అలాంటప్పుడు రావణుడిపై రాముడి భక్తి ఛాన్సే లేదు. అయితే పంజాబ్ రాము మాత్రం.. రావణుడి భక్తుడు. రావణుడిపై రాముకు ఎంత భక్తి అంటే తన భూమిని రావణ ఆలయ నిర్మాణం కోసం లూథియానాలోని మహాత్మా రావణ్ జ్ఞాన్ పీఠ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. 
 
లూథియానాలోని తల్వాండీ కలాన్ ప్రాంతానికి చెందిన రామ్ చంద్ (70) అనే వ్యక్తి రావణుడిని ఆరాధించడం ద్వారా ఫేమస్ అయిపోయాడు. రావణుని ఆలయం కోసం రాము తన భూమిని విరాళంగా ఇచ్చేయడం ద్వారా ఫిల్లౌర్ జిల్లాలోని పంజ్దేరా గ్రామంలో త్వరలో మహాత్మా రావణ్ మందిర్ నిర్మాణం జరుపుకోనుంది. 
 
ఆసక్తికర విషయం ఏమిటంటే... అందరూ దసరా సందర్భంగా రావణ దహనం చేస్తుంటే, రాము మాత్రం రావణుడి కోసం 'శోక సభ' నిర్వహిస్తాడు. రావణుడిపై ఇంత భక్తి ఎందుకని ప్రశ్నిస్తే.. సోదరికి అవమానం జరిగితే.. ప్రతికారం కోసం రగిలిపోయాడన్నాడు. రావణుడు యుక్తిపరుడని కొనియాడాడు. అదండీ.. రావణుడిపై రాము భక్తి కథ.