గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (12:00 IST)

పెటాకులైన అత్తాఅల్లుడి పెళ్లి.. వింత పెళ్లికి పంచాయతీ ఆమోదం... శుభంకార్డుతో ముగింపు

బీహార్‌లో అత్తాఅల్లుడి పెళ్లి పెటాకులైంది. వాస్తవానికి ఈ వింత పెళ్లికి గ్రామ పంచాయతీ పెద్దలు కూడా సమ్మతం తెలిపితే.. భార్యాభర్తలైన అత్తాఅల్లుళ్లు మాత్రం శుభం కార్డుతో ముగింపు పలికారు. తాజాగా వెలుగులోక

బీహార్‌లో అత్తాఅల్లుడి పెళ్లి పెటాకులైంది. వాస్తవానికి ఈ వింత పెళ్లికి గ్రామ పంచాయతీ పెద్దలు కూడా సమ్మతం తెలిపితే.. భార్యాభర్తలైన అత్తాఅల్లుళ్లు  మాత్రం శుభం కార్డుతో ముగింపు పలికారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌లోని మధేపుర జిల్లాలో అత్తాఅల్లుడు పెళ్లి చేసుకున్నారు. ఈ వింత పెళ్లి జూన్ ఒకటో తేదీన జరిగింది. ఆశాదేవి కూతురు లలితకు(19), సూరజ్‌‌కు(22) రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఆశాదేవి అల్లుడు సూరజ్‌ను దక్కించుకోవాలనుకుంది. వారి వ్యవహారం కాస్తా శ్రుతిమించి అక్రమసంబంధం వరకూ వెళ్లింది. 
 
కూతురుని చూడాలన్న వంకతో వచ్చిన ఆశాదేవి అల్లుడి ఇంటికి వచ్చి రాసలీలలు సాగించేది. ఆమె మోజులో పడిన సూరజ్ లలితను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో సూరజ్, లలిత మధ్య తరచూ గొడవలు జరిగేవి. అమ్మ లాంటి అత్తతో అక్రమ సంబంధం తప్పని భార్య ఎంత వాదించినా సూరజ్ వినలేదు. చివరకు సూరజ్, ఆశాదేవి పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పంచాయితీ పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. 
 
ఈ పరిస్థితుల్లో తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్నారు. తమకు విడాకులు ఇప్పించాలని కోరారు. తాను ఎంత అవివేకపు పని చేశానో ఇప్పటికి తెలిసిందని, తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నానని సూరజ్ చెప్పాడు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పు చేయనని తెలిపాడు. తన అత్త ఆశాదేవిని వివాహం చేసుకున్నప్పటికీ ఒక తల్లిగానే చూశాను తప్ప భార్యగా భావించలేదని సూరజ్ చెప్పడం ఇక్కడ అసలు ట్విస్ట్. తాను చేసిన పనికి కూతురిని క్షమాపణలు కోరతానని, సూరజ్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఆశాదేవి తెలిపింది.