శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (16:19 IST)

నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్‌కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..

మోతాదుకు మించి హానికర రసాయనాలు ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా నిషేధించిన మ్యాగీ నూడిల్స్ కేసులో నెస్లే సంస్థకు కాస్త ఊరట లభించింది. దేశవ్యాప్తంగా నిషేధించిన మ్యాగీ నూడుల్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నెస్లే చేసుకున్న అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది.
 
మ్యాగీ నూడుల్స్‌లో సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండడంతో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‍‌ఎస్ఏఐ) తన పరిశోధనల్లో రుజువుకావడంతో దేశ వ్యాప్తంగా ఆ ఉత్పత్తులను జూన్ ఐదో తేది నుంచి నిషేధించింది. అయితే అంతటితో ఆగక వాటిని ధ్వంసం చేయాలనే డిమాండ్ వెల్లడైంది. 
 
వాటిని ధ్వంసం చేయడం ద్వారా భారీ నష్టం వాటిల్లుతుందని, కనుకు ఇక్కడ నిషేధించబడిన మ్యాగీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నెస్లే సంస్థ కోర్టును కోరింది. దీనిపై విచారించిన ముంబై కోర్టు నెస్లే విజ్ఞప్తిని అంగీకరించింది.