శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:25 IST)

డ్యాన్స్ బార్లలో సీసీటీవీలు ఎందుకు..... కస్టమర్ల ప్రైవసీని పాడు చేయొద్దు : సుప్రీంకోర్టు

డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బార్లకు వచ్చే కస్టమర్ల ప్రైవసీని పాడు చేయొద్దని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు అనుమతులు, నిబంధనలపై

డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బార్లకు వచ్చే కస్టమర్ల ప్రైవసీని పాడు చేయొద్దని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు అనుమతులు, నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. 
 
బార్లలోని సీసీటీవీల కనెక్షన్లు సమీపంలోని పోలీసు స్టేషన్లకు అనుసంధానమై ఉండాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమానులు కోర్టుకు వెళ్లగా, సీసీటీవీ కెమెరాలు అక్కడికి వెళ్లే కస్టమర్ల ప్రైవసీని పాడు చేస్తాయని కోర్టు అభిప్రాయపడింది. కెమెరాల కారణంగా బార్ యజమానులు, బార్ గర్ల్ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషనర్లు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.