Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ‌స్సులో మహిళకు ముద్దుపెట్టాడు.. ఆపై పరారైనాడు.. రేప్ చేశాడని బీజేపీ నేతపై ఫిర్యాదు?

మంగళవారం, 4 జులై 2017 (17:03 IST)

Widgets Magazine
kiss

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. నేరాలకు పాల్పడే బీజేపీ నేతల సంఖ్య కూడా పెరిగిపోతోంది. మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత బ‌స్సులో ఓ మ‌హిళ‌కు ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం కెమెరా కంటికి చిక్క‌డంతో ఆ నేత చిక్కుల్లో ప‌డ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడే ఇటీవ‌ల ఓ బ‌స్సులో అంద‌రితో క‌లిసి ప్ర‌యాణిస్తున్నాడు. గద్‌చిరోలీ జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలోకి బ‌స్సు రాగానే అందులోని ఓ మహిళకు ముద్దు పెట్టాడు. ఆ మహిళతో ఆతనికి ముందే పరిచయం ఉన్నట్లు సమాచారం. కానీ సదరు మహిళ మాత్రం రవీంద్ర బవన్‌థాడేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తాజా ఘ‌ట‌న అనంత‌రం ఆ మ‌హిళ స‌ద‌రు నేతపై కేసు పెట్టింది. అప్పటి నుంచి ర‌వీంద్ర క‌నిపించ‌కుండా పోయాడు. తనకు ర‌వీంద్ర‌ ఉద్యోగం ఇస్తానని చెప్పాడ‌ని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని.. తనపై అత్యాచారానికి పాల్పడ్డానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రవీంద్ర బవన్ థాడేపై అత్యాచారం కేసు నమోదైంది. బస్సులోని సీసీటీవీ వీడియోలో రవీంద్ర బవన్‌థాడే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను ముద్దుపెట్టుకున్నట్లుంది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజకీయాల్లో పవన్ చరిత్ర సృష్టిస్తాడు.. ఏపీ పాలిటిక్స్‌‌కు బెస్ట్ ఆప్షన్ అతడే: నాగబాబు

జబర్దస్త్ జడ్జి, మెగా సోదరుడు, నటుడు నాగబాబు తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ...

news

నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని యవ్వన ఆత్మహత్య(వీడియో)

కారణాలు ఏమయినప్పటికీ నారాయణ కళాశాలలో చదివే విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ...

news

బీర్ హెల్త్ డ్రింకా..? అమ్మాయిలను కూడా తాగమంటారా? ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను?: రోజా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ...

news

'అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించా.. మరి నా సంగతేంటి' : సర్పంచ్‌ భర్తకు చెప్పుదెబ్బలు

ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె ...

Widgets Magazine