శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (18:56 IST)

పంజాబీ, కాశ్మీర్ భాషల్లో మహాత్మాగాంధీ రాసిన జీవితచరిత్ర!

జాతిపిత మహాత్మాగాంధీ 'ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్' పేరుతో రాసిన  జీవితచరిత్ర పంజాబీ, కాశ్మీరీ భాషల్లో ప్రచురితమైంది. ఈ తాజా ఎడిషన్లు గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు విడుదల కానున్నాయి.
 
"గురువారం మహాత్ముడి 145వ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర కొత్త ఎడిషన్లను రిలీజ్ చేస్తాం" అని 1929లో గాంధీ స్థాపించిన 'నవజీవన్ ట్రస్ట్'కు ప్రస్తుతం మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న వివేక్ దేశాయ్ తెలిపారు. కొత్త ఎడిషన్లతో కలిపి దేశంలోని పదిహేడు ప్రధాన భాషల్లో గాంధీజీ జీవితచరిత్ర అందుబాటులో ఉంది.