Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారట.. ఓటు ధర రూ.2వేలు?

శుక్రవారం, 17 మార్చి 2017 (16:50 IST)

Widgets Magazine
cash notes

ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా.. నిజాయితీగా జరిగితే ప్రజలకు, ప్రజా సేవకులకు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డబ్బు లేనిదే ఎన్నికలు జరగదని.. యూపీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.

నోట్లు రద్దయ్యాక కూడా యూపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు ఓటుకు నోటుకోసమే ఖర్చు చేశారని తెలిసింది. ఒక్కో ఓటు విలువ సగటున రూ.750 అని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఓటు పడటం కోసం రాజకీయ పార్టీ రూ.2వేలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడి అయ్యింది. మూడింట ఒక వంతు మంది ఓటర్లు నగదు లేదా మద్యం స్వీకరించి, ఓటు వేశారని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. 
 
అయితే వారు చేసిన ఖర్చులో ఈ 25 లక్షల రూపాయలు సముద్రంలో నీటి బొట్టులాంటిదని తేలిపోయింది. ప్రచార కార్యక్రమాల్లో సాంకేతిక పరికరాలు, ఓటర్లు భారీగా డబ్బు పంచి పెట్టడం, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేయడంతో భారీ మొత్తాన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వీడియో వ్యాన్లు, భారీ తెరలను బహిరంగంగా పెట్టి ప్రచారం చేశారు. ఈ విధంగా చేసిన ప్రచారానికి రాజకీయ పార్టీలు దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ఉంటుందని సీఎంఎస్ సర్వేలో తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మన కోసం పొట్టి శ్రీరాములు...

భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది 50 సంవత్సరాలు నిరంతరం సాగిన ఆందోళనల ...

news

రోజాపై బాబుకు ఎందుకింత కక్ష-కేంద్రానికంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువా?: వైవీ ప్రశ్న

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి ...

news

శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం: మార్చి 16.. ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే..

జాత్యంహకార దాడులకు బలైపోయిన కూచిభొట్ల శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. మార్చి 16వ, ...

news

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. ...

Widgets Magazine