మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (10:09 IST)

సైన్యం లంచాలు తీసుకుంటోంది.. టోల్‌ప్లాజాల వద్ద వసూళ్లకు పాల్పడుతోంది: మమతా బెనర్జీ

సైన్యం లంచాలు తీసుకుంటోందని, టోల్‌ప్లాజాల వద్ద వసూళ్లకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సైన్యం మోహరింపుపై మండిపడ్డా

సైన్యం లంచాలు తీసుకుంటోందని, టోల్‌ప్లాజాల వద్ద వసూళ్లకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సైన్యం మోహరింపుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై దాడి చేసేలా కేంద్రం ఆర్మీని వినియోగిస్తోందని, రాష్ట్రం నుంచి వెంటనే సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
రాష్ట్రంలో ఆర్మీ మోహరింపు అంశం శుక్రవారం పార్లమెంటును కుదిపేసింది. ఈ విషయంలో ప్రధానిగానీ, రక్షణ మంత్రిగానీ వివరణ ఇవ్వాలని తృణమూల్‌, ఇతర విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో, లోక్‌సభలో రక్షణ మంత్రి పర్రీకర్‌, రాజ్యసభలో సహాయ మంత్రి సుభాశ్‌ భామ్రే వివరణ ఇచ్చారు. 
 
అత్యవసర సమయంలో తమకు ఉపయోగపడేలా ఆర్మీ కేవలం భారీ వాహనాల లెక్కలు మాత్రమే సేకరించిందని, ఇది మామూలు విషయమేనని, ఎక్కడా డబ్బులు తీసుకోలేదని మమత బెనర్జీ తెలిపారు.