అరగంట పాటు ఆకాశంలోనే తిరిగిన విమానం.. మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారా?

గురువారం, 1 డిశెంబరు 2016 (12:02 IST)

mamata benerjee

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారని ఆ పార్టీ మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. బుధవారం రాత్రంతా ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాకుండా అరగంట పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. విమానాశ్రయానికి చేరుకునేందుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే విమానం ఐదు నిమిషాల్లో ల్యాండవబోతోందని చెప్పాడని కానీ అరగంట తర్వాత ల్యాండైందని హకీం ఆరోపించారు. 
 
పట్నా నుంచి రాత్రి 7.35 గంటల సమయంలో బయలుదేరిన విమానం కోల్‌కతాలో ల్యాండ్‌ నిర్ణీత సమయానికి ల్యాండ్‌ కాలేదు. అరగంట పాటు ఆకాశంలో తిరగాడింది. చివరకు రాత్రి 9 గంటల సమయంలో విమానాశ్రయంలో ల్యాండైంది. ఆ సమయంలో విమానంలో మమతాతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్‌ హకీం కూడా ఉన్నారు. 
 
విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి సమాచారం అందించినా అధికారులు స్పందించలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే మమతను చంపేందుకు ప్లాన్ చేసినట్లు ఉందని హకీం తెలిపారు.
 
 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ...

news

రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తాళాలు మా చేతికి వచ్చాయి..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ...

news

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు ...

news

ఖాకీ కర్కశత్వం : ఏటీఎంలో 2 కార్డులు వాడినందుకు చేయి విరగ్గొట్టారు

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ ...