శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (11:53 IST)

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్కారు చెప్తుండటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవటం తగదని హితవు పలికారు. 
 
ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం సర్కారు విషయంలో చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి రావాలని మోడీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఇలాంటి నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.