Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యను కట్నం కోసం కాలుతున్న కట్టెతో కొట్టాడు.. యాసిడ్ పోశాడు.. ముఖంపై పడిందా?

ఆదివారం, 18 జూన్ 2017 (13:22 IST)

Widgets Magazine

భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలాపుఝా జిల్లాకు చెందిన 31 ఏళ్ల భార్యపై భర్త, అత్త తరచూ ఘర్షణకు దిగేవారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ చితకబాదారు. తొమ్మిదేళ్ల క్రితం వీరివివాహం జరిగింది. వివాహ సమయంలో రూ .2లక్షలు, 20 నాణేల బంగారాన్ని కట్నంగా ఇస్తామని తన తల్లిదండ్రులు హామీ ఇచ్చినట్లు బాధిత మహిళ వెల్లడించింది. 
 
అయితే కేవలం బంగారం మాత్రమే ఇవ్వడంతో తనకు వేధింపులు మొదలయ్యాయి. జూన్ ఆరో తేదీ మహిళ భర్త కాలుతున్న కట్టెతో ఆమెను చితకబాదాడు. అనంతరం తీవ్ర గాయాలపాలై నేలపై పడి ఉన్న ఆమెపై యాసిడ్ పోశాడు.
 
అయితే ముఖంపై యాసిడ్ పడకుండా ఆమె తప్పించుకోగలిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో భర్త, అత్తపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విందులో బీఫ్ లేదు.. పెళ్ళి వద్దే వద్దు.. రద్దు చేసుకున్న వరుడు ఫ్యామిలీ.. ఎక్కడో తెలుసా?

దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్‌ పెట్టలేదని వివాహం ...

news

భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం: మనస్తాపంతో భార్య ఆత్మహత్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ...

news

కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం.. రంజాన్ ఉపవాసం.. కుటుంబ కలహాలతో?

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కాటేశాడు. స్నేహితులతో కలిసి ...

news

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. టీవీనటితో పాటు మేకప్ మేన్ అరెస్ట్

సెక్స్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేస్తూ.. ఓ టీవీనటిని అరెస్ట్ చేశారు. ...

Widgets Magazine