Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వావివరసలు మరిచి విచ్చలవిడితనం... ఒకే కుటుంబంలో నలుగురితో సంబంధాలు...

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (08:36 IST)

Widgets Magazine
faction murder

ఓ కామాంధుడు వావివరసలు మరిచిపోయాడు. కామపైశాచికత్వంతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఫలితంగా ఒకే కుటుంబంలో నలుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకు ఆ అక్రమ సంబంధమే అతని ప్రాణాలు తీసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్, పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌ (35) అనే వ్యక్తి ఉన్నత చదువులు అభ్యసించాడు. అబుదాబిలోని నేషనల్‌ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి పాతబస్తీలోని పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలేర్పడ్డాయి. వారి ద్వారానే నచ్చిన అమ్మాయిలను తన ఇంటికి రప్పించుకుని ఎంజాయ్ చేసేవాడు. అయితే, ఇది మంచి పద్దతి కాదని అతని బంధువులు హెచ్చరించినా పట్టించుకోలేదు. 
 
పైగా, కట్టుకున్న భార్యనూ వేధించసాగాడు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై భార్య వరకట్న వేధింపుల కేసు పెట్టింది. 4వ తేదీన కోర్టు వాయిదా ఉండటంతో దుబాయ్‌ నుంచి ఇమ్రాన్‌ ఇటీవల నగరానికొచ్చాడు. జంగమ్మెట్‌కు చెందిన షేక్‌ సర్వర్‌తో కలిసి నాంపల్లి కోర్టు వెళ్ళాడు. రాత్రయినా తిరిగి రాకపోవటంతో ఇమ్రాన్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది 
 
సయ్యద్‌ ఇమ్రాన్‌కు ఓ వివాహిత, ఆమె ముగ్గురు మరదళ్లతోనూ వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వివాహిత భర్త సయీద్‌ బిన్‌ సాబెర్‌ ఖతర్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన సాబెర్ పద్దని మార్చుకోవాలని ఇమ్రాన్‌ను హెచ్చరించాడు. అయినా ఇమ్రాన్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో సాబెర్‌ హైదరాబాద్‌లో తన తమ్ముడు సైఫ్‌ బిన్‌ సాబెర్‌ బరూద్‌తో కలిసి హత్యకు పథకం వేశారు. 
 
ఈ మేరకు జమాల్‌బండలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 4వ తేదీన నాంపల్లి కోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌కు ఆ వివాహితతో ఫోన్‌ చేయించి అద్దె ఇంటికి రప్పించారు. అక్కడ సయీద్‌ బిన్‌ సాబెర్‌, సైఫ్‌ బిన్‌ బరూద్‌, హాషం అలీలు ఇమ్రాన్‌ కత్తులతో పొడిచి హత్యచేశారు. మృతదేహాన్ని హషంపురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద పూడ్చివేశారు. 
 
అయితే, ఈ నెల 4వ తేదీన అదృశ్యమైన సయ్యద్‌ ఇమ్రాన్‌ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఇమ్రాన్‌ కాల్‌డేటా ఆధారంగా సైఫ్‌ బిన్‌ సాబెర్‌ బారూద్‌, హషీంను అదుపులోకి తీసుకున్నారు. కాగా హత్య కేసులో ప్రధాన నిందితుడైన సయీద్‌ బిన్‌ సాబెర్‌ దుబాయ్‌ వెళ్ళిపోయాడని, ఆ వివాహిత కూడా పరారీలో ఉందని డీసీపీ తెలిపారు. దుబాయ్‌ పారిపోయిన నిందితుని కోసం రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీచేశామని పురానీహవేలి సౌతజోన్‌ కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Murder Hydrabad Police Accused Illegal Affair

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రైవేట్ గూండాల నిఘాలో తమిళ ఎమ్మెల్యేలు: ఔరా శశికళా..!

జయలలితకు లాగే తనకుకూడా నమ్మిన బంటులాగా పడి ఉంటాడనుకున్న పన్నీరు సెల్వం తిరుగుబాటుతో సీఎం ...

news

చివరకు అమ్మ ఇల్లు కూడా కొట్టేశారా? ఎంత దుర్మార్గమో!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన ఇల్లు పోయెస్ గార్డెన్ తమకు దేవాలయం వంటిదని, ...

news

వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం: కాళ్లబేరానికి వచ్చిన స్పీకర్ కోడెల

మహిళలు వంటింటికే పరిమితమైతే ఎలాంటి వేధింపులుండవు, బయటికొస్తేనే ఎక్కడలేని ప్రమాదాలు అంటూ ...

news

శశికళ జయ వారసురాలా? ససేమిరా అంటున్న గౌతమి

అన్నాడిఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆమె వారసురాలిగా శశికళను ...

Widgets Magazine