శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (15:53 IST)

రూ.38 కోట్ల కరెంట్ బిల్లు చూసి.. అతనికి ఫ్యూస్ పోయింది..

నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్ సంస్థ సాంకేతిక లోపాల కారణంగా లక్షల్లో రోమింగ్ ఛార్జీలతో కూడిన బిల్లును ఓ కస్టమర్‌కు పంపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో రూ.38 కోట్ల కరెంట్ బిల

నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్ సంస్థ సాంకేతిక లోపాల కారణంగా లక్షల్లో రోమింగ్ ఛార్జీలతో కూడిన బిల్లును ఓ కస్టమర్‌కు పంపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో రూ.38 కోట్ల కరెంట్ బిల్లు చూసి ఓ వ్యక్తి ఫ్యూస్ పోయింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన జంషెడ్‌పూర్‌కు చెందిన గుహ అనే వ్యక్తికి విద్యుత్ బిల్లు షాక్ ఇచ్చింది. 
 
విద్యుత్ శాఖ ఇచ్చిన బిల్లులో రూ.38కోట్లు కట్టాల్సిందిగా ప్రింట్ అయ్యింది. పైగా ఈ బిల్లును చెల్లించలేదని.. విద్యుత్ అధికారులు గుహ ఇంటికి విద్యుత్ సరఫరాను ఆపివేశారు. మూడు గదులతో కూడిన తన ఇంటికి ఇంత మొత్తంలో కరెంట్ బిల్లు వచ్చే అవకాశం లేదని గుహ ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్లెట్స్, టీవీని ఉపయోగిస్తున్నామని గుహ చెప్పుకొచ్చాడు. 
 
ఇంత మొత్తంలో బిల్లు ఎలా వస్తుందనే విషయాన్ని పట్టించుకోకుండా విద్యుత్ సరఫరాను కట్ చేయడం ఎంతవరకు సమంజసమని గుహ ప్రశ్నిస్తున్నాడు. అంతేగాకుండా దీనిపై విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా కేసు పెట్టాడు.