శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (12:37 IST)

వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో మహిళను కారులోనుంచి తోసేశాడు.. ఎక్కడ?

వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో ఒక మహిళను కారులోనుండి తోసేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగింది. మథురకు చెందిన యువతి ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై గల ఒక ఏటీఎంలో డబ్బు తీసుకోవడానికి వెళ్తుండగా ఆమెను ఒక వ్యక్తి కారులో వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించాడు. ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పి వివాహనికి ఒప్పుకోవాలని బలవంతపెట్టాడు. దీనికి ఆ యువతి ససేమిరా అంగీకరించలేదు. 
 
ఆగ్రహించిన ఆ యువకుడు దగ్గర సిద్ధంగా ఉంచుకున్న సుత్తితో ఆమె తలని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా రక్తస్రావాలతో ఆ యవతి కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా ఆమెను కారునుండి బయటకు తోసివేసాడు. అనంతరం అక్కడి నుండి కారులో పారిపోయాడు. రోడ్డుపై ఆమెని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు ఆమెను వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం యువతి  మధురలో స్వర్ణ జయంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ యువతి ఒక పోస్ట్-గ్రాడ్యుయేట్, మార్చి 2016 వరకు ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.ఆమెను గాయపరిచిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.