శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (12:46 IST)

అంగారకుడి 3D ఇమేజ్ పంపిన మామ్: ఫేస్‌ బుక్‌లో ఇస్రో

'మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్) తాజాగా అంగారకుడి త్రీడీ ఫొటోను పంపింది. కలర్ కెమెరాను ఉపయోగించి మామ్ ఈ ఫోటోను తీసినట్లు ఇస్రో తన ఫేస్ బుక్ పేజీలో తెలిపింది. సెప్టెంబర్ 24న అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటివరకు మూడు ఫోటోలను పంపింది.
 
కాగా, సెప్టెంబర్ 24వ తేదీన అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటి వరకు పలు చిత్రాలను పంపిన సంగతి తెలిసిందే. అంగారకుడి ఉత్తరార్ధగోళంలో దూళి తుఫానుకు సంబంధించిన ఫోటోలను మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) రెండు రోజుల క్రితం పంపించింది. 
 
వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ఉపగ్రమంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని క్లిక్‌మనిపించిందని తెలిపింది.