శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (14:15 IST)

మోడీ పాలన.. సంక్షోభంలో మైనారిటీ పాలన: మాణిక్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో మైనారిటీల భద్రత సంక్షోభంలో పడిందని త్రిపుర ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్‌ సర్కార్‌ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే దేశంలో 12కు పైగా మత ఘర్షణలు జరిగాయని, ఇవన్నీ కూడా మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగాయని మాణిక్ వెల్లడించారు. 
 
బీజేపీకి ఆత్మగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందూత్వ భావజాలాన్ని బీజేపీపై రుద్దుతోందని వ్యాఖ్యానించారు. ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు సాధారణ ప్రజలకు నష్టం చేకూరేవిధంగా ఉన్నాయని,  రైల్వే చార్జీలు, సరుకు రవాణా చార్జీల పెంపు వల్ల సామాన్యులపై మోయలేని ఆర్థిక భారం పడిందన్నారు. 
 
అమెరికా సామ్రాజ్యవాదం వెంట మోడీ ప్రభుత్వం నడుస్తున్నదని, అందుకే పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న ఫాసిస్టు దాడులను మనదేశం ఖండించడంలేదని మాణిక్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వామపక్షాల పరిస్థితి దిగజారినా దేశంలో వామపక్షాల పాత్ర ఏమాత్రం తగ్గలేదన్నారు.