శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (17:24 IST)

మణిపూర్‌లో హైడ్రామా.. రాజీనామా చేసేందుకు సీఎం ఇబోబి సింగ్ ససేమిరా

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో రాజకీయ హైడ్రామా సాగుతోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 60 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లను గెలుచుకుని అతిపె

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో రాజకీయ హైడ్రామా సాగుతోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 60 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 24 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీనికి గవర్నర్ స్పందిస్తూ.. మొదటి సీఎం పదవికి రాజీనామా చేయాలని, అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించగలనని తాను చెప్పినప్పటికీ ఇబోబి సింగ్ ఎలాంట బదులు ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆమె సోమవారం మీడియాకు వెల్లడించారు. 
 
కాగా, బీజేపీ తరపున ఒక ఎల్‌జేపీ ఎమ్మెల్యే, నలుగురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే తనను కలిశారని, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నట్టు ఎన్‌పీపీ అధ్యక్షుడు తనకు ఫోను చేసి చెప్పడంతో పాటు, మద్దతు లేఖను కూడా పంపారని, మొత్తం బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే విషయంలో తాను సంతృప్తి చెందానని నజ్మా హెఫ్తుల్లా వివరించారు.