గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (13:09 IST)

భార్య సమ్మతి లేకుండా శృంగారంలో పాల్గొంటే తప్పులేదు : గుజరాత్ హైకోర్టు

భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది.

భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. 
 
అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. 
 
అయితే భర్త భార్యపై అసహజ సెక్స్‌కు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు పెట్టవచ్చని, భార్యను లైంగికంగా వేధించడం, పశువులా లైంగిక చర్యలా పాల్పడటం ఐపీసీ సెక్షన్ 377 కిందకు వస్తాయని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.