గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (15:07 IST)

జల్లికట్టు ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేయొచ్చు.. కానీ ఆందోళన వద్దు : ఖట్జూ

జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ

జల్లికట్టు ఆందోళనకారుల్లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై నెలకొన్న భయాందోళనలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివృత్తి చేసేపనిలో పడ్డారు. ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ ట్వీట్ చేశారు. 
 
జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ తాత్కాలికమైనదే. అయితే, దీనిపై గవర్నర్ సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. అయినా ఈ ఆర్డినెన్స్ తాత్కాలికమైనదనడం నిజమేనని జస్టిస్ కట్జూ చెప్పారు. అయితే తమిళనాడు శాసనసభ సోమవారం సమావేశం కాబోతోందని, ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టాన్ని ఆమోదిస్తుందని, అది శాశ్వతమైనదవుతుందని తెలిపారు. 
 
ఈ విధంగా చేసిన చట్టంపై కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని, అయితే ఇది విజయవంతం కాకపోవచ్చునని తెలిపారు. దీనికి కారణం రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం లభించడమేనని పేర్కొన్నారు. అందువల్ల జల్లికట్టు మద్దతుదార్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు.