Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి పేరుతో మహిళా జర్నలిస్టుతో రాసలీలలు.. ప్రముఖ చానెల్ న్యూస్ ఎడిటర్ అరెస్టు

బుధవారం, 26 జులై 2017 (13:17 IST)

Widgets Magazine
amal vishnudas

తన వద్ద పని చేసే సీనియర్ మహిళా జర్నలిస్టును పెళ్లి పేరుతో మోసం చేసి తన కోర్కె తీర్చుకన్న కేసులో ప్రముఖ మలయాళ న్యూస్ చానెల్‌కు చెందిన న్యూస్ ఎడిటర్‌ను తిరువనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 
 
ప్రముఖ ఛానల్‌‌లో సీనియర్ న్యూస్ ఎడిటర్‌‌గా అమాల్ విష్ణుదాస్‌ పని చేస్తున్నారు. ఈయన తన కింద పని చేసే ఓ మహిళ జర్నలిస్టును పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత జర్నలిస్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
ఈ ఫిర్యాదులో మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే ఆమెకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే  విడాకులు మంజూరైన తర్వాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కెరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించడమే కాకుండా, తన తండ్రి వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు న్యూస్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. ఆయనను బుధవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు),  506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్‌ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డ్రగ్స్ స్కామ్... ఇక హైదరాబాద్ టెక్కీల వంతు.. ఐటీ కంపెనీలకు వార్నింగ్

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ...

news

భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంట్లో భార్య... కోడలిని కోర్కెతీర్చమన్న మామ....

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి ...

news

నా భర్తను చంపు, కానీ నా పిల్లాడిని వదిలిపెట్టు ఎందుకంటే...?

మనుషులు ఆధునికంగా మారుతున్న కొద్దీ బంధాలు సన్నగిల్లుతున్నాయి. సర్వకాల సర్వావస్థలలోనూ ...

news

రైళ్ల ఆహారంలో నాణ్యత గోవిందా: వెజ్ బిర్యానీలో బల్లి.. సురేష్ ప్రభుకు ట్వీట్..!

రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి ...

Widgets Magazine