శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (15:26 IST)

మాంసమే మాకిష్టం...! మారిపోతున్నశాకాహారులు...!

ప్రపంచ వ్యాప్తంగా మాంసం ప్రియుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.  అందుకు ముఖ్య కారణం శాకాహరులు కూడా మాంసాహారులుగా మారిపోతుండడమేనని హ్యుమన్ రీసెర్చ్ కౌన్సిల్ తాజాగా జరిపిన అధ్యయనంలో ద్వారా వెల్లడైంది. 
 
జీవిత కాలంలో 84 శాతం మంది శాకాహారులు మాంసాహారులుగా మారుతున్నారని, అయితే వారిలో 29 శాతం మంది మాత్రం పోషకాహారం కోసం తాము మాంసాహారులుగా మారామని పేర్కొనటం విశేషం.
 
అదేవిధంగా అగ్ర రాజ్యం అయిన అమెరికాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే శాకాహారులట. అక్కడి వారిలో 43 శాతం మంది కూరగాయలు తినడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. 
 
శాకాహారులుగా ఉండి మాంసాహారులుగా మారిన వారిలో 37 శాతం మంది ప్రస్తుతం తాము మాంసాహారం తింటున్నా, భవిష్యత్తులో మాంసం ముట్టమని అంటున్నారట.
 
మొత్తం మీద శాకాహారుల్లో ఎక్కువగా మహిళలు, ఉన్నత విద్యావంతులు, మేధావులు ఉన్నారని హ్యుమన్ రీసెర్చ్ కౌన్సిల్ జరిపిన అధ్యయనంలో తేటతెల్లమైంది.