గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (12:05 IST)

ఆ గ్రామాల యువకుల పెళ్లి ఆశలపై నీళ్లు చల్లుతున్న గంగానది వరదలు.. ఎలా?

గంగా నది వరదలు ఆ 25 గ్రామాల యువకులకు శాపంగా మారాయి. ఫలితంగా పెళ్లీడు వచ్చినా.. బ్రహ్మచారులుగానే బతుకు వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ యువకుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివ

గంగా నది వరదలు ఆ 25 గ్రామాల యువకులకు శాపంగా మారాయి. ఫలితంగా పెళ్లీడు వచ్చినా.. బ్రహ్మచారులుగానే బతుకు వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ యువకుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గలాగలా పారుతున్న గంగా నదికి ప్రతి ఏటా వరదలు వెల్లువెత్తుతుండటంతో గట్టు లేక తీరంలోని 25 గ్రామాల్లో భూమి కోతకు గురవుతోంది. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా వరదపీడిత 25 గ్రామాలకు చెందిన యువకులకు పెళ్లీడు వచ్చినా పిల్లనిచ్చే వారు కరవయ్యారు.
 
ఆయా గ్రామాల యువకుల పెళ్లి సంబంధాలను ఇతర గ్రామాల ప్రజలు తిరస్కరిస్తున్నారు. తమ బిడ్డలను వరద గ్రామాల యువకులకు ఇచ్చి వారిని వరదల పాలు చేయలేమని వధువుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారట.