గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (15:53 IST)

విలువైన రాయి అనుకుని ఫ్రిజ్‌లో పెట్టారు.. ఆపై యాక్ అని వాంతులు చేసుకున్నారు.. ఎందుకు?

ఢిల్లీ విమానం నుంచి కింద పడిన మానవ వ్యర్థాన్ని ఉల్కా శకలంగా భావించి ఫ్రిజ్‌లో పెట్టారు ఓ గ్రామస్థులు. ఈ స్టోరీ విని చాలామంది ఫక్కున నవ్వుకుంటారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వున్న గూర్గాన్ ఫజిల్‌పుయ

ఢిల్లీ విమానం నుంచి కింద పడిన మానవ వ్యర్థాన్ని ఉల్కా శకలంగా భావించి ఫ్రిజ్‌లో పెట్టారు గ్రామస్తులు. ఈ స్టోరీ విని చాలామంది ఫక్కున నవ్వుకుంటారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వున్న గూర్గాన్ ఫజిల్‌పుయిర్, బద్లి గ్రామంలో.. విమానం నుంచి ఎండిన మానవ వ్యర్థం కింద పడింది. దీన్ని అపురూపంగా చూసిన గ్రామస్తులు అదేదో అంతరిక్షానికి చెందిన స్పటిక రాయిగా భావించారు. 
 
విలువైన నిధి సంపద కూడా అయి ఉండవచ్చని మరికొందరు భావించారు. ఆ రాయిని ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆ రాయి నమూనాలను సేకరించారు. ఆ రాయి నమూనాలను పరీక్షించాకే తెలిసింది.. అసలు విషయం. అది రాయి కాదని.. విమానం నుంచి కిందపడిన మానవ వ్యర్థమని. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దాన్ని బయటికి విసిరికొట్టి... ఫ్రిజ్‌తో పాటు ఇంటి మొత్తాన్ని బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేశారు. అలాగే విమానాల్లో మలమూత్రాలను ఘనరూపంలో భద్రపరుస్తారు. వీటిని బ్లూ ఐస్ అంటారు. ఇవి అప్పుడప్పుడు లీకై విమానాల నుంచి కిందకు పడుతుంటాయని గ్రామస్తులకు అధికారులు చెప్పారు. దీంతో ఆ గ్రామస్తులు యాక్ అంటూ వాంతులు చేసుకున్నారు.