గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (15:25 IST)

అర్థరాత్రి శ్మశానంలో విందు భోజనం... అంత్యక్రియల్లో అరటాకేసుకుని ఆరగించారు...

మన దేశం వివిధ ఆచారాలకు ఆలవాలం అని పెద్దలు చెపుతుంటారు. ఈ ఆచారాల్లో కొన్ని వింత వింత ఆచారాలు కూడా మనకు అక్కడక్కడ దర్శనమిస్తుంటాయి కొన్నిసార్లు. తిరుచ్చి జిల్లా రామనంపట్టి గ్రామ శ్మశానంలో ఇలాంటి వింత ఆచారం ఒకటి వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... ఈ గ్రామంలో ఎవరైనా మరణిస్తే చనిపోయిన తర్వాత 16వ రోజు నిర్వహించే కర్మకాండలో శ్మశానంలో విందుభోజనాలు చేస్తారట. ఈమధ్య ఆ గ్రామంలో 70 ఏళ్ల చిన్నమ్మాళ్ చనిపోయింది. 
 
ఆమె కుమారుడు ఆళగర్ సామి తమ ఆచారం ప్రకారం ఆదివారం నాడు స్వీట్లు ఇంకా ఇతర తినుబండారాలతో 16వ రోజు శ్మశానానికి వెళ్లాడు. ఈ తంతును నిర్వహించేందుకు బంధుమిత్రులు కూడా వచ్చారు. సరిగ్గా అర్థరాత్రి సమయం కాగానే తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలో ఓ పెద్ద అరిటాకును పరిచి అందులో తినుబండారాలన్నిటినీ పెట్టేశాడు. ఆ తర్వాత అక్కడి మట్టితో శివలింగాన్ని, ఆవుడయార్, గుర్రపు బొమ్మలు తయారుచేసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. 
 
అనంతరం తాము అరటాకులో పెట్టిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆకులో ఉన్న పదార్థాలను అంతా కలిసి సామూహికంగా ఆరగించారు. ఈ తంతు ఆదివారం తెల్లవారుజాము వరకూ సాగింది. దీనిపై ఓ పెద్దాయన్ను కదిలిస్తే... ఇది ఇప్పటిది కాదనీ... తరతరాలుగా వస్తున్న ఆచారామని చెప్పుకొచ్చాడు.