శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (08:51 IST)

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం విన్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత నాందేడ్ కార్పొరేషన్‌లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. 
 
ఔరంగాబాద్ సెంట్ర ల్ నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబైలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం తరఫున గెలుపొందగా, ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు.