శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:24 IST)

శశికళ సీఎం కారాదు... పన్నీరుకు మద్దతిద్దామా? వద్దా? నేతలతో స్టాలిన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీకి చెందిన ముఖ్య నేతలతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీకి చెందిన ముఖ్య నేతలతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ నిర్వహించారు. మంగళవారం రాత్రి పన్నీర్‌ సెల్వం తిరుగుబావుటా ఎగుర వేసిన విషయం తెల్సిందే.
 
ఈనేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ తమ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అదేసమయంలో పన్నీర్‌ సెల్వం కూడా తన మద్దతుదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్టాలిన్‌తో పన్నీర్‌ సెల్వంకు సత్సంబంధాలున్న నేపథ్యంలో అవసరమైతే ఆయనకు డీఎంకే మద్దతు ఇస్తుందన్న ఊహాగానాలకు ఈ భేటీలతో బలం చేకూరినట్లయింది. 
 
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో చీలికలు తప్పవన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్‌ సెల్వంతో కలిపి ఏఐఏడీఎంకేకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది.