గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (12:48 IST)

బాయ్‌ఫ్రెండ్ వేధింపులు భరించలేక మోడల్ అర్చనా పాండే సూసైడ్!

బాయ్‌ఫ్రెండ్ పెట్టే టార్చర్ భరించలేని ముంబైకు చెందిన ప్రముఖ మోడల్ అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాయ్‌ఫ్రెండ్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు పాండే సూసైడ్ లేఖలో పేర్కొంది. 
 
ముంబై వెర్సోవా ప్రాంతంలోని న్యూ మహాడా కాలనీలోని ఓ అపార్టుమెంట్ 12వ అంతస్థులో అర్చనా పాండే నివశిస్తూ వచ్చింది. ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చి తలపులు పగులగొట్టి చూడగా అర్చనా పాండే తన పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకునివున్నట్టు గుర్తించారు. 
 
ఆత్మహత్యకు పాల్పడే ముందు అర్చనా పాండే ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ ఒమర్ పఠానే తన ఆత్మహత్యకు కారణమంటూ పేర్కొంది. అతని వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపింది. కేవలం మోడల్‌గానే కాకుండా ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా కూడా రాణిస్తూ వచ్చిన అర్చనా పాండే రెండు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడివుంటుందని పోలీసులు చెపుతున్నారు. కాగా, 2009లోనే మోడలింగ్ వదిలేసిన అర్చనా.. ప్రస్తుతం మీర్జా ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తోంది.