Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మన్మోహన్ రెయిన్ కోట్ స్నానం.. బాత్రూమ్‌లోకి తొంగిచూడటం మోడీ అలవాటే: రాహుల్ ఎద్దేవా

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:05 IST)

Widgets Magazine
Rahul

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇతరుల బాత్రూమ్‌లోకి తొంగిచూడటం మోడీ అలవాటని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోడీకి ఇక మిగిలింది రెండున్నరేళ్లేనని.. గడచిన రెండున్నర ఏళ్లలో మోదీ దారుణంగా విఫలమయ్యారని రాహుల్ దుయ్యబట్టారు. 
 
మోడీని ఎవరైనా ఆయనను ప్రశ్నించినప్పుడు, సమాధానాలు చెప్పలేక ఎదురు దాడికి దిగుతారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 99 శాతం సీట్లను గెలుచుకోవడానికే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. కొంతమంది మన్ కీ బాత్ చెబుతారు కాని, కామ్ కీ బాత్ చెప్పరని ఎద్దేవా చేశారు. 
 
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. 'గూగుల్‌లో రాహుల్‌ పేరు మీద సెర్చ్‌ చేస్తే, అతడి పేరు మీద ఉన్నన్న జోకులు ఎవరిమీదా ఉండవు' అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నూర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల సభలో శుక్రవారం ప్రసంగించారు. ఇంటర్నెట్‌ గూగుల్‌లో రాహుల్‌ పేరుతో సెర్చ్‌ చేస్తే... బోలడన్ని జోకులు వస్తాయన్నారు.
 
యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌పైన కూడా మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రధాని తప్పుపట్టారు. గూగుల్‌లో ఆ జోకుల వెంట రాహుల్‌తో పాటు అఖిలేశ్‌ కూడా వస్తున్నాడని విమర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోల్‌కతాలో మైనర్ బాలికల వ్యభిచారం... నిర్వాహకుల అరెస్ట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న వ్యహారాన్ని ...

news

జిందాబాద్ అనలేదు.. వర్ధిల్లాలి అన్నాడు.. విజయ్ కాంత్ చెంప చెళ్లుమనిపించాడు..

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత ...

news

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?

తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ ...

news

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా ...

Widgets Magazine