గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (18:06 IST)

ఆగస్టులో నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన : 17 ఏళ్ల తర్వాత..!

17 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చల కోసం నేపాల్‌లో పర్యటించనున్నారు. ఆగస్టులో నరేంద్ర మోడీ పర్యటన ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఆయన ఖాట్మండు వెళతారు. ఇటీవలే భూటాన్ లో పర్యటించిన మోడీ పొరుగుదేశాలతో సంబంధాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. 
 
కాగా, 17 ఏళ్ళ తర్వాత ఓ భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చల కోసం నేపాల్ లో పర్యటించడం ఇదే ప్రథమం. అంతకుముందు 1997లో అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ నేపాల్‌లో పర్యటించారు.
 
కాగా, 2002లో అప్పటి ప్రధాని వాజ్ పాయి నేపాల్‌లో పర్యటించారు. అయితే, అప్పుడు ఆయన సార్క్ దేశాల సమావేశం కోసం అక్కడికి వెళ్ళారు. కానీ ద్వైపాక్షిక చర్చల కోసం 17 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీనే నేపాల్‌లో పర్యటించనుండటం విశేషం. ఈ పర్యటన సందర్భంగా మోడీ శివుని పశుపతి ఆలయాన్ని సందర్శిస్తారని, నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తారని తెలుస్తోంది.