గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (07:34 IST)

ఏప్రిల్ 9 నుంచి మోడీ విదేశీ పర్యటన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 9 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలనుకుంటున్న మోడీ దూర దేశాలతో కూడా అదే విధమైన సంబంధాలను కలిగి ఉండాలనే భావిస్తున్నారు. శాస్త్ర సాంకేతికత, వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఆ దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు. 
 
ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో మోదీ పర్యటిస్తారు. తొలుత ఏప్రిల్ 9 నుంచి ఫ్రాన్స్‌లో, 12 నుంచి జర్మనీలో, 14 నుంచి కెనడాల్లో మోదీ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌లతో మోదీ సమావేశమవుతారు.
 
ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలపరచుకోవడం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు.