మీ ఓటమిని కోట్లమంది తమదిగా తీసుకున్నారు.. దాన్ని మర్చిపోండి: మోదీ

హైదరాబాద్, సోమవారం, 31 జులై 2017 (07:24 IST)

భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను దక్కించుకోలేదేమో కానీ వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుందని ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారు తనని కలిసినప్పుడు ఫైనల్‌ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగమని సూచించినట్టు చెప్పారు. 
 
‘మీరు ప్రపంచకప్‌లో విజేతలుగా నిలవలేకపోయామనే ఆలోచనను మనస్సులోంచి తుడిచేయండి. కప్‌ను గెలిచారా లేదా అనేది అప్రస్తుతం. కానీ భారతీయుల మనస్సులను గెలిచారు. వారు నన్ను కలిసినప్పుడు అందరి ముఖాల్లో కాస్త నిరాశ, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించింది. నేను వారికి ఒకటే చెప్పాను. 
 
ఇది మీడియా యుగం. విపరీతమైన అంచనాలతో బరిలోకి దిగి ఫలితం రాకపోతే ఇలా నిరాశ, బాధ అలుముకుంటాయి. అయితే తొలిసారిగా వారి ఓటమిని కోట్లాది మంది దేశ ప్రజలు తమదిగా తీసుకుని వారి బరువును తగ్గించారు. ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగండి’ అని ప్రధాని పేర్కొన్నారు.
 దీనిపై మరింత చదవండి :  
టీమిండియా మహిళా జట్టు ప్రధాని నరేంద్ర మోదీ Women's Team Prime Minister Narendra Modi

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా అమ్మతో నెహ్రూ అనుబంధాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు: పమేలా బాటన్

భారత దేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాకు భారత తొలి ప్రధాని ...

news

జీన్స్‌ వేసుకునే పిల్ల సర్పంచా అని వెక్కిరిస్తే గ్రామాన్నే మార్చి పడేసింది.

తలమీదుగా పైట కప్పుకోవటం అనే పురాతన ఆచారాన్ని గౌరవించని, జీన్స్‌ ప్యాంట్, కుర్తా, ...

news

ఆ కోటీశ్వరురాలు 21 ఏళ్ల నుంచి చీర కొనలేదు.. వదిలేశారు.. అంతే..

పది తరాలకు సరిపడా డబ్బు సంపాదించిన వారు కూడా జీవితంలో అత్యంత ఇష్టమైనవి త్యజించడం ఈ కాలంలో ...

news

ఇకపై 'సంక‌ల్ప్ ప‌ర్వ'గా ఆగస్టు 15వ తేదీ : నరేంద్ర మోడీ

ఇకపై ఆగస్టు 15వ తేదీని సంకల్ప్ పర్వగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...